ETV Bharat / state

TEMPLE SCHOOL: బడైనా...గుడైనా అదే.. - Government school at the temple in Ramapuram

ఆ ఊరి పిల్లలు ఉదయాన్నే గుడి గంట మోగగానే పుస్తకాలు పట్టుకొని ఆలయానికి వెళ్తారు. అక్కడ గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని.. తిరిగి ఇంటికి చేరుకుంటారు. గుడిలో పాఠాలు అంటే..అవేవో వేదాలు, ఉపనిషత్తులు అనుకునేరూ.. అవి కానే కాదు. అచ్చంగా మన ప్రభుత్వ బడిలో చెప్పే పాఠాలే. వీటిని చెప్పేది కూడా ప్రభుత్వోపాధాయుడే. కానీ గుడిలో బడి ఎందుకు?

Public school in the temple
ఆలయంలో ప్రభుత్వ పాఠశాల
author img

By

Published : Sep 8, 2021, 8:41 PM IST

ఆలయంలో ప్రభుత్వ పాఠశాల

ఆ ఊరి పిల్లలు చదువుకునేందుకు గుడికెళ్తారు. అక్కడ పాఠాలతో పాటు మధ్యాహ్న భోజనం ఆరగించేసి పాఠాలు వింటారు. పాఠశాల ముగిశాక కాసేపు మిత్రులతో కలిసి ఆడిపాడి ఇంటికి చేరుకుంటారు. ఈ బడిలాంటి గుడి.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురం గ్రామంలో ఉంది.

గత కొన్నేళ్లుగా ఇక్కడి దేవాలయంలోనే పాఠశాల కొనసాగుతోంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 2017 సెప్టెంబర్​లో శిథిలావస్థకు చేరుకోగా పాఠశాల పైకప్పు పెచ్చులూడి కింద పడిపోయేవి. దీంతో పాఠశాలను ఒక అద్దె భవనంలోకి మార్చాలని అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేశారు. కానీ అద్దె భవనం దొరకకపోవడంతో స్థానిక పెద్దల సహకారంతో 2018 నుంచి గ్రామంలోని రామాలయంలో ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో స్థానిక గ్రామంలోని రామాలయమే.. మూడేళ్లుగా భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయంగా మారింది.

రామాపురం గ్రామంలో 195 గృహాలతో 500 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు టీచర్లు.. 18 మంది పిల్లలు మాత్రమే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. మారుమూల గ్రామం కావడంతో గ్రామంలో ఇదొక్కటే బడి ఉంది. ఉన్న ప్రభుత్వ బడి భవనం కూలిపోవడంతో దేవాలయంలోనే బడిని కొనసాగిస్తున్నారు.

బడి గంటా గుడి గంటా ?

సాధారణంగా బడి గంటకు.. గుడి గంట తేడాలుంటాయి. కానీ ఈ గ్రామంలో బడి గంట అయినా, గుడిగంట అయినా ఒక్కటే. ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలు గుడిగంటను బడిగంట అనుకొని పాఠశాలకు రావాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

దేవాలయంలో గుడ్డు నిషేధం

ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే విద్యార్థులకు ఉడికించిన గుడ్లు, చిక్కీ ఇస్తుంటారు. కానీ ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్నంతోపాటు గుడ్డు తినే యోగం లేదు. దేవాలయంలోనే బడి ఉండటంతో గుడ్డును నిషేధించారు. అయితే పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో ఇస్తారు. అలాగే మధ్యాహ్న భోజనం సైతం బయటే వండుకుని తీసుకువచ్చి పిల్లలకు వడ్డిస్తారు.

ఆలయ ఆవరణమే ఆటస్థలం

ఈ పాఠశాలలో విద్యనభ్యసించే పిల్లలకు ఆలయ ఆవరణమే ఆట స్థలంగా మారింది. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేస్తుండగానే విద్యను అభ్యసించాలి వస్తుంది.

నూతన భవనం నిర్మించాలని ఆవేదన

గత మూడేళ్ల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనం ఏర్పాటుకు రూ.7.5 లక్షల నిధులు మంజూరైనట్లు స్థానికులు తెలిపారు. సంబంధిత గుత్తేదారు పాఠశాల నూతన భవనం నిర్మాణానికి పునాదులు తవ్వి..మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.

నాడు-నేడుకు ఎంపిక కాలేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనుల కింద సైతం ఈ పాఠశాల భవనం ఎంపిక కాలేదు. దీంతో నాడైనా.. నేడైనా ఈ పాఠశాల గుడిలోనే కొనసాగుతోంది.

అద్దె భవనం లభించక..

గ్రామంలోని పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో అద్దె భవనం కోసం వెతికాము. దొరకకపోవడంతో స్థానిక పెద్దల సహకారంతో రామాలయంలో బడి నిర్వహణకు ఒప్పుకున్నాము. గత మూడేళ్లుగా పాఠశాలను రామాలయంలో నిర్వహిస్తున్నాము. -ఖాజామియా, ప్రధానోపాధ్యాయులు

మధ్యలోనే నిలిచిన పనులు

పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠశాల అభివృద్ధికి గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా సంబంధిత గుత్తేదారు నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చి మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. దీనికి కారణం తాను గతంలో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందుల వల్లే నిర్మాణం చేపట్టలేదని తెలిపాడు. - ప్రభాకర్ నాయుడు, రామాపురం గ్రామస్థుడు

గుడ్డు ఇచ్చినా గుడి బయటే

మా పాఠశాలలో గుడ్డు ఇస్తున్నారు.. కానీ అది గుడి బడి బయటే..పాఠశాలను గుడిలో కొనసాగించడంతో మాకు అన్నంతోపాటు ఉడికించిన గుడ్డు తినే యోగం లేదు. పాఠశాల అనంతరం ఇచ్చే గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నాం. -వాసవి, విద్యార్థిని, రామాపురం

స్కూల్​ భవనం కట్టండి..

మా గ్రామంలో పాఠశాల లేదు. దీంతో పాఠశాలలో గ్రామంలోని దేవాలయంలో నిర్వహిస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు పట్టించుకునే మా గ్రామంలో నూతన పాఠశాల నిర్మించాలని కోరుతున్నాను. -వేణు ప్రియ, విద్యార్థిని, రామాపురం

ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి పాఠశాల భవనాన్ని నిర్మించి.. చిన్నారులకు బంగారు భవిష్యత్​ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండీ.. chavithi celebrations: వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.