ETV Bharat / state

పోలీసుల తనిఖీలు..లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం

author img

By

Published : May 22, 2021, 6:57 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ఇంట్లో.. 1440 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ. 3 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

karnataka liquor caught at adoni
ఆదోనిలో పెద్దఎత్తున కర్ణాటక మద్యం పట్టివేత

కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో.. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. పట్టణంలోని బోయగేరీలో ఉన్న గృహంలో 30 పెట్టెల్లో దాచి ఉంచిన 1,440 టెట్రా ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ రూ. లక్షా 30 వేలు ఉంటుందని.. రాష్ట్రంలో రేట్ల ప్రకారం చూస్తే రూ. 3 లక్షలు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనలో ఓ వ్యక్తిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సంతేకుడ్లుర్​కు చెందిన ప్రతాప్ రెడ్డి మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఎమ్మార్వో ఆఫీస్​లో కొండచిలువ హల్​చల్.. భయాందోళనలో యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.