జిల్లాలోని మంత్రాలయం అసెంబ్లీ స్థానానికి భాజపా,జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భాజపాఅభ్యర్థి జెల్లీ మధుసూదన్ మాధవరం రహదారి నుంచి ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయం వరకు వచ్చి నామినేషన్ వేశారు. ఆయన వెంట సినీ నటి, భాజపా నాయకురాలు కవిత హాజరయ్యారు. అలాగే జనసేన అభ్యర్థి బోయ లక్ష్మన్న, పిరమిడ్ పార్టీ అభ్యర్థి హేమంత్ నామినేషన్లు వేశారు.
కర్నూలు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నగరంలోని జమ్మీ చెట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు వైకాపా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డోన్ సీపీఐ అభ్యర్థిగా రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్ నుండి పాత బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.డోన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సందు వెంకటరమణ నామినేషన్ సమర్పించారు. పట్టణంలోని ఎన్నికల అధికారి కార్యాలయం చేరుకొని ఆర్వో వెంకటేశ్వర్లుకు నామినేషన్ పత్రాలను అందించారు.