ETV Bharat / state

ఇతడి మరణానికి.. గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమా?

కర్నూలు జిల్లాలోని హోటల్​లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే.. ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు మృతుని మరణానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఆ వ్యక్తి చనిపోవటానికి కారణాలేంటి? సిలిండర్ పెలటమా..లేదా!
author img

By

Published : Sep 29, 2019, 7:13 PM IST

ఆ వ్యక్తి చనిపోవటానికి కారణాలేంటి? సిలిండర్ పెలటమా..లేదా!

కర్నూలు జిల్లా నంద్యాల నూనెపల్లె వంతెన కింద ఉన్న ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో హోటల్లోని వస్తువులు కాలిపోయాయి. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి రాయి ఎగిరి అతని తలకు తగిలి మృతి చెందాడా? లేక మరో కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు సుబ్బయ్యకు 50 ఏళ్లకు పైగా ఉంటాయన్న పోలీసులు అతని ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి:

ఇద్దరిని కాపాడి.. తాను మృత్యు ఒడికి చేరి

Intro:Ap_Nlr_03_29_Kulina_Dhvaja_Sthambam_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరం నవాబుపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లీశ్వర స్వామి ఆలయంలో పురాతన ధ్వజస్తంభం నేలకొరిగింది. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ధ్వజస్తంభం రాత్రి అకస్మాత్తుగా విరిగిపోయింది. ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అధికారులు, అర్చకులు ఆలయానికి చేరుకుని ధ్వజస్తంభాన్ని పరిశీలించారు. ధ్వజస్తంభంలో ఉండే మాను దెబ్బ తినడం వల్లే విరిగిపోయింటుందని అధికారులు భావిస్తున్నారు. ధ్వజస్తంభం పడిపోవడంతో ఆలయంలో నవరాత్రుల సందర్భంగా జరగాల్సిన పూజలను రద్దు చేశారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం పూజలు ప్రారంభిస్తామని, ధ్వజస్తంభాన్ని త్వరలోనే పునః ప్రతిష్టిస్తామని అధికారులు తెలిపారు.
బైట్: ఉమామహేశ్వర శర్మ, ఆలయ అర్చకుడు, నెల్లూరు.
నవీన్ కుమార్, ఆలయ ఈవో, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.