కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జన్మదినం సందర్భంగా అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే బాణాసంచా మీద పడి పెద్దకడబూరుకు చెందిన చిరంజీవి అనే యువకుడు, గంగోత్రి అనే యువతికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇదీ చదవండి:
'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'