కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస సెంటర్లో సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కొవిడ్ ఆసుపత్రి నుంచి తొలగించి...మరోచోట ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ చికిత్సలు ప్రారంభించాలని వారు కోరారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.
ఇదీ చూడండి. 'ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాష-సంస్కృతులే పునాది'