కర్నూలు జిల్లా నంద్యాలలో డ్రోన్లతో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో వీటిని చల్లుతున్నారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లపై అనవసరంగా తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: