విజయవాడ రూరల్ మండలం నిడమానూరు బాపిరాజు చెరువు ఆక్రమణలకు గురవుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట గుడి నిర్మాణం పేరుతో చెరువును పూడ్చేందుకు కొందరు అక్రమార్కులు యత్నించినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్… చెరువు ఆక్రమణలను తక్షణమే నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: 'రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు'