ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్‌ లేఖ

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రులిద్దిరికీ షెకావత్‌ లేఖ రాశారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్‌ లేఖ
తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్‌ లేఖ
author img

By

Published : Jan 17, 2021, 5:24 AM IST

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రులిద్దిరికీ షెకావత్‌ లేఖ రాశారు. గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా డీపీఆర్‌లు అందివ్వాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ స్పందిస్తూ డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా కోరింది.

తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్ర మంత్రి షెకావత్‌ తెలిపారు. కృష్ణాపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ఇవ్వాలన్నారు. డీపీఆర్‌లు సహా అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పటివరకు తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్‌ కూడా రాలేదని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతలపై నిబంధనల మేరకు డీపీఆర్‌ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్‌ ఇవ్వాలని గోదావరి బోర్డును కోరారు. పురుషోత్తమపురం మినహా దేనికీ డీపీఆర్‌ ఇవ్వలేదన్నారు. కృష్ణాపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని.. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని కోరారు. డీపీఆర్‌లు, ఇతర వివరాలు ఇస్తేనే సమస్య పరిష్కారమువుతుందన్నారు. డీపీఆర్‌లు వెంటనే ఇచ్చేలా చూడాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు వేర్వేరుగా లేఖలు రాశారు.

For All Latest Updates

TAGGED:

DPR
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.