రంజాన్ పండుగ సందర్భంగా నందిగామలో ముస్లిం కుటుంబాలకు తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రంజాన్ కానుకను అందజేశారు. రంజాన్ పర్వదినాన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం.. సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆమె కోరారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ఇచ్చేదని.. వైకాపా ప్రభుత్వానికి అవేమీ పట్టవని ఆమె ఎద్దేవాచేశారు. లాక్ డౌన్‌తో ఉపాధి కోల్పోయిన బడుగు, బలహీన వర్గాలను, పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం