కరోనా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి శుక్రవారం మధ్యాహ్నం వరకు రూ.173 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా విరాళాలు భారీగా వస్తున్నాయని అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ విభాగం రూ.75 లక్షలు, కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. కుమార్ యాదవ్ సహా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా - ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పంకజ్ రెడ్డి, కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె.అనిల్ కుమార్ చెక్కులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి అందించారు. సీఎం సహాయనిధికి కాకినాడలోని రమ్య హాస్పిటల్స్ యాజమాన్యం రూ.25 లక్షలు విరాళం ఇచ్చింది. హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పితాని అన్నవరం, డెరెక్టర్ డాక్టర్ ప్రభావతి చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. సీఎంఆర్ఎఫ్కు ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున రూ.10 కోట్లు ఇచ్చారు. ఏపీఎస్బీసీఎల్ ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనం 86 లక్షల 5 వేల 384 రూపాయలు విరాళంగా అందించారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఏపీఎస్‌బీసియల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీయూష్ కుమార్ సీఎం జగన్ను కలసి చెక్కు అందించారు.
ఇదీ చూడండి: