కరోనాపై అవగాహన కల్పించేందుకు భవిష్యత్ భద్రతా దళం కన్వీనర్ మురళీకృష్ణ ముందుకువచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజారులో కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులకు.. చేతుల్లో శానిటైజర్ వేసి శుభ్రం చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజలెవరూ గుంపులుగా రావద్దని.. సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్‌కు మందు లేదని.. స్వీయ నియంత్రణ వల్లే అరికట్టవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: