ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక కోసం 7వ ఆర్థిక గణనకు సంబంధించిన గోడ ప్రతులను కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అసంఘటిత రంగంలోని ప్రజల ఆర్థిక లావాదేవీలను సేకరించే ఉద్దేశంతో ఈ సర్వేను చేపడుతున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు సర్వే సమాచారం కోసం ప్రతి ఇంటికి వస్తారని.. వారికి వివరాలు అందించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వివిధ వృత్తుల్లో పనిచేసే ప్రజల వివరాలు సేకరిస్తే... రాష్ట్ర, దేశవ్యాప్తంగా తయారుచేసే ప్రణాళికల్లో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సారి సర్వే వివరాల కచ్చితత్వం కోసం మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: