కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య 194.81 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల చుట్టూ 1 నుంచి 2.90 కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై 2019 నవంబరు 28న ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసి అభ్యంతరాలను 60 రోజుల్లోపు తెలపాలని కోరింది. గడువులోపు ఒక అభ్యంతరంకానీ, సూచనకానీ రాకపోవడంతో ముసాయిదాను ఖరారుచేస్తూ సోమవారం తుది నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన రెండేళ్లలోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జోనల్ మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ఇందులో నిర్దేశించింది.
ఇదీ చూడండి. రెండు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు