సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమ రైతులకు ఎంతో ప్రత్యేకమైంది. వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న పశువుల కోసం ఈ కనుమ జరుపుకుంటారు. వ్యవసాయదారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా పంట చేతికి వస్తుంది. విజయవాడ గ్రామీణలో చిన్న కంచి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్ దైవ స్వరూపంగా కొలిచే పశువులను పూజించటం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని దేవస్థానం పూజారులు చెప్పారు. ఈ పసుపు పూజ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: