కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ విద్యాసంస్థలో విద్యాశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టినట్లు విద్యాశాఖ కమిషన్ ఛైర్ పర్సన్ విజయశాంతా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.ఒక్కో తరగతి గదిలో 40 మంది విద్యార్ధులను ఉంచాలని నిబంధనలు ఉంటే వాటిని పట్టించుకోకుండా.. సుమారు 60- 70 మందిని కూర్చోబెడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచలేదని గుర్తించామన్నారు. అలాగే పిల్లలకు భోజన సదుపాయాలు అంతంత మాత్రంగా అందుతున్నాయన్నారు. యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయశాంతా వెల్లడించారు.
ఇదీ చదవండి : 30 వరకు ఇళ్ల స్థలాల పంపిణీ.. అర్హులందరికీ అందే వరకూ అమలు