ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.పలువురు అధికారులతో ఆక్సిజన్ సరఫరాపై మంత్రి ఆన్‌లైన్ ద్వారా చర్చించారు. రాష్ట్ర అవసరాల తర్వాతే... ఇతర రాష్ట్రాలకు సరఫరా చేపడతామన్న గౌతమ్ రెడ్డి రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి లోటులేదని తెలిపారు.
ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా..... 510 ఎం.టీ మెడికల్ ఆక్సిజన్ తయారవుతుందని ఆయన వివరించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,.... కర్నూలు జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి