ETV Bharat / state

కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు... అప్రమత్తమైన యంత్రాంగం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో....కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికల దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఇంతియాజ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. డివిజినల్​ కార్యాలయాల్లో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటుచేయాలన్నారు. మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

Heavy rains
Heavy rains
author img

By

Published : Oct 11, 2020, 11:01 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని అన్ని మండలాలలోని లోతట్టు గ్రామాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. టెలీ కాన్సెరెన్స్ ద్వారా అధికారులు, రెవిన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. పాడుపడిన, మట్టి గోడలతో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవిన్యూ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మత్స్యకారులెవరు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తెలిపారు.

విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు వారివారి ప్రాంతాల తహసీల్దార్లను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సహాయక చర్యల కోసం అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేశారు.

కంట్రోల్​ రూమ్​ నంబర్లు

  • బందరు కలెక్టరేట్ : 08672-252572
  • విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం : 0866 - 2474805
  • సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454
  • సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు : 08656- 232717
  • రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486
  • రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697

ఇదీ చదవండి : విశాఖ జిల్లాలో భారీ వర్షాలు... సముద్రంలో వేట నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.