రాజధాని భూములకు సంబంధించి అవినీతి నిరోధకశాఖ నమోదు చేసిన కేసులో ఈ నెల 15న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ న్యాయవాది మమతారాణి వ్యాజ్యం దాఖలు చేశారు. తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు తావివ్వాలని కోరారు. మమతారాణి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇంప్లీడ్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేశామని మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసరావు తరపు న్యాయవాది ప్రణతి కోర్టుకు తెలిపారు. మమతారాణి తరపు న్యాయవాది కౌంటర్పై తిరుగు సమాధానంగా కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు . అందుకు సీజే అంగీకరించారు. మాజీ ఏజీ తో పాటు మరికొందరిపై అనిశా నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటిపైనా స్టే ఇచ్చిన హైకోర్టు .. ఎఫ్ఐఆర్లోని అంశాలు మీడియాలో రాకుండా నిలువరిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: