విజయవాడ భవానీపురంలో కొందరు వ్యక్తులు ఓ బడ్డీ కొట్టుకు వెళ్లి సరకులు తీసుకున్నారు. ఆమెకు ఐదు వందల రూపాయల నోట్ ఇచ్చి చిల్లర తీసుకెళ్లిపోయారు. ఆ నోటు తేడాగా ఉందన్న విషయాన్ని బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న విజయలక్ష్మీ గ్రహించి తెలిసిన వారికి చూపించింది. వారి సహాయంతో పోలీసులకు విషయం చేరవేస్తే అసలు గుట్టు బయటపడింది.
ఆ నోటు ఇచ్చిన ముగ్గురిని పోలీసులకు అప్పగించారు. నింధితులను నుండి 3,500 నకిలీ నోట్లు, దొంగ నోట్లు ముద్రిస్తున్న జిరాక్స్ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని భవానీపురం పీఎస్ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: జనం సొమ్ముతో... ఎంత కాలమిలా?