ETV Bharat / state

'సేంద్రియ కూరగాయల వినియోగమే మేలు'

అధిక దిగుబడే లక్ష్యంగా కృష్ణా జిల్లా రైతులు పండిస్తున్న పంటలపై రసాయనిక ఎరువులు, పురుగు మందులను అధిక మోతాదులో పిచికారీ చేస్తున్నారు. దీంతో విషతుల్యమవుతున్న కూరగాయలు, పండ్లు తినడం వలన ప్రజల ఆరోగ్యం గుల్లవ్వక తప్పడం లేదు. ఫలితంగా ఏలూరులో ప్రబలిన వింత రోగంతో 600 మంది వరకు అస్వస్థతకు గురయ్యారని జాతీయస్థాయి వైద్య పరిశోధన సంస్థలు వెల్లడించాయి. వండే ముందు కూరగాయలను తప్పనిసరిగా శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నవారవుతారు. కృష్ణా జిల్లాలోని కైకలూరులో రైతులు పండిస్తున్న పంటల సాగుపై ప్రత్యేక కథనం..

Crop cultivation in Kaikaloor Krishna district
సేంద్రియ కూరగాయలను వినియోగించడమే మేలు...
author img

By

Published : Jan 17, 2021, 4:27 PM IST

మార్కెట్లలో నిగనిగలాడుతూ కనిపించే కూరగాయలు, ఆకుకూరలను కొంటున్నారా.. ఒక్క క్షణం ఆలోచించండి. వంకాయ, బెండకాయ, టమాటా, మిర్చి, క్లాలీఫ్లవర్‌ తదితరాలను కొనే ముందు ఒకసారి వాటిని వాసన చూడండి.. వాటిపై రసాయనాలు గుప్పుమనొచ్చు. ఈ అవశేషాలను కంటితో గుర్తించలేము. నీటిలో బాగా కడగకుండా వంట చేస్తే ఆహారంలోకి అవి చేరినట్లే.. మార్కెట్‌ నుంచి తీసుకువచ్చే చాలా రకాలపై కాలకూట విషం పేరుకుపోయి ఉంటుంది. మితిమీరిన అవశేషాల వల్లే ఇటీవల ఏలూరులో ప్రబలిన వింత రోగంతో 600 మంది వరకు అస్వస్థతకు గురయ్యారని జాతీయస్థాయి వైద్య పరిశోధన సంస్థలు వెల్లడించాయి. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే వీటి ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని కృష్ణా జిల్లాలోని కైకలూరులోని పలువురు అధికారులు సూచిస్తున్నారు.

పురుగు మందుల ప్రభావంతో ప్రబలుతున్న వ్యాధులు..

తాజా కూరగాయలతోపాటు పాటు యాపిల్‌, అరటి, ద్రాక్ష, దానిమ్మ, సపోటా పండ్లలోనూ పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. అవి ఆహారంతో పాటు శరీరంలోకి ప్రవేశించి నాడీ సంబంధిత, కేన్సర్‌ తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో నాలుగు వేల హెక్టార్లలో కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయాధికారుల చెబుతున్నారు.

తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలపై తెగుళ్ల దాడులు పెరిగాయి. వీటిపై విపరీతంగా మందులు పిచికారీ చేస్తూ నేరుగా మార్కెట్లకు తరలిస్తున్నారు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనాలపై కూడా పురుగు మందుల ప్రభావం ఉంటోంది. అధిక దిగుబడే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయానికి బదులు కాంప్లెక్స్‌, యూరియా ఎరువులతోపాటు అత్యధిక గాఢత కలిగిన పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. వీటి సాగుపై ఉద్యాన, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది.

కోతకు ముందు పిచికారీ చేయకూడదు..

కూరగాయల మొక్కలపై పురుగులు, తెగుళ్లు కనిపించిన వెంటనే హెక్సాకోనాజోల్‌, మోనోక్రోటోఫాస్‌, క్లోరిపైరిఫాస్‌ వంటి మందులను రైతులు పిచికారీ చేస్తున్నారు. పంట కోసే పది రోజుల ముందు వీటిని చల్లకూడదు. మొక్క మెత్తదనం కోసం, కాయ సైజు పెరగడం కోసం సేఫ్‌ కాల్షియం, బోరాన్‌, నైట్రోజన్‌, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషక ఎరువులను వాడుతున్నారు. వీటి ప్రభావం తక్కువైనా వారం పాటు అవశేషాలు ఉంటాయి. అధికారులు చెప్పే సూచనలకన్నా పురుగు మందుల వ్యాపారులు చెప్పేవాటికి రైతులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో వీటి వాడకం పెరిగిపోతోంది.

Crop cultivation in Kaikaloor Krishna district
సేంద్రియ కూరగాయలను వినియోగించడమే మేలు...

ఇలా చేస్తే మేలు..

  • కూరగాయలు వండే ముందు మంచి నీటితో నాలుగైదు సార్లు కడగాలి.
  • పొటాషియం పెర్మాంగనేట్‌ ద్రావణంలో కడిగి తర్వాత మంచినీటితో శుభ్రపరచాలి.
  • ఉప్పు ద్రావణంలో కొద్ది నిమిషాలు ఉంచడంతో క్రిములు చనిపోతాయి. తర్వాత తిరిగి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.
  • అవకాశం ఉంటే కూరగాయలు, పండ్ల పైపొరను తొలగించాలి.
  • సేంద్రియ సాగులో పండించే కూరగాయలు, ఆకుకూరలు పండ్లు వినియోగించడం మేలు.

ఆరోగ్యం గుల్ల..

విషతుల్యమవుతున్న కూరగాయలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యం గుల్లవ్వక తప్పదు. రైతులు ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్న పురుగు మందుల అవశేషాలు చాలా కాలం కూరగాయలపై నిల్వ ఉంటాయి. వండే ముందు వాటిని తప్పనిసరిగా శుభ్రపరచుకోవాలి. లేకుంటే అనారోగ్యం తప్పదు. - విద్యులత, వైద్యురాలు, మండవల్లి

అవసరం మేరకే వినియోగించాలి..

కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా నిల్వ ఉండవు కాబట్టి అవసరం మేరకే పురుగు మందులు వినియోగించాలి. కొన్ని సందర్భాలలో అవసరం లేకున్నా మందులను వినియోగిస్తున్నారు. ఇలాంటి పద్ధతులను రైతులు విడనాడాలి. సాధ్యమైనంత వరకు పురుగు మందుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వేప సంబంధ పదార్థాలు వాడుకుంటే పెట్టుబడి కూడా తగ్గుతుంది. - స్వర్ణలత, ఏడీఏ, మండవల్లి

ఇదీ చదవండి:

ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.