కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో మెుసలి సంచారం కలకలం రేపుతోంది. నాచుగుంట గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతంలో కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో నది ఒడ్డున పెద్ద మెుసలిని మత్స్యకారులు చూశారు. అప్పటి నుంచి వారు భయాందోళన చెందుతున్నారు. కృష్ణానదిలో వేలాది మంది మత్స్యకారులు చేపలు, రొయ్యలు, పీతల వేట సాగిస్తూ ఉంటారు. మెుసలి అభయారణ్యం పరిధిలో ఉండటంతో అటవీశాఖ అధికారులు దానిని గుర్తించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: