ETV Bharat / state

'తక్షణమే విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి' - ముఖ్యమంత్రికి సీపీఐ లేఖ

ముఖ్యమంత్రి జగన్​కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తక్షణమే పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

ramakrishna
రామకృష్ణ
author img

By

Published : Dec 25, 2019, 7:19 PM IST

విద్యార్థులకు పెండింగ్ ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్‌షిప్, మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని కోరుతూ... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి ​జగన్​కు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ ఇస్తోంది.

గతేడాది నవంబర్ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఫార్మసీ, నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర కోర్సుల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​, మెస్, కాస్మోటిక్ ఛార్జీల కింద ఇవ్వాల్సిన రూ. 4,200 కోట్లు విడుదల చేయలేదని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి 3 నెలలకు ఒకసారి ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ ఇంతవరకు విడుదల చేయకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తదితర బకాయిలను కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూలు చేసిన తరువాతే టీసీలు ఇస్తున్నాయని లేఖలో వివరించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.