వినియోగదారుడి క్షేమమే తన లాభమంటూ.. ఓ మటన్ వ్యాపారి వినూత్న పద్ధతిలో అందరిని ఆకర్షిస్తున్నాడు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వెంకటేశ్వరరావు అనే మటన్ వ్యాపారి కొత్త తరహాగా ఆలోచించి హెల్మెట్లను పంపిణీ చేస్తున్నాడు. ఐదు కేజీల మటన్ కొన్నవారికి హెల్మెట్ ఉచితంగా ఇస్తున్నాడు. కేజీ మటన్ ఆరు వందల రూపాయలు కాగా.. ఐదు కేజీలు కొన్న వారికి అంతే విలువజేసే హెల్మెట్‌ను ఉచితంగా ఇస్తున్నాడు. అయితే వినియోగదారుడు క్షేమంగా ఉంటే తన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. అంతేకాదండీ.. ప్లాస్టిక్ వాడకుండా ఇంటి దగ్గర నుంచి స్టీల్ బాక్స్ తెచ్చుకుంటే వినియోగదారుడికి రూ. 20 కూడా తగ్గిస్తున్నాడు.
ఇవీ చూడండి... ఆకాశవీధిలో... అందాల జంట..