కరోనా కట్టడిలో నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రముఖ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ... శానిటైజర్ బాటిళ్లు, మాస్కులు అందించారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ద్వారకా తిరుమలరావుని... తండ్రి సురేంద్రతో కలిసిన సురేఖ...లక్షా 60వేల రూపాయల విలువ చేసే... 700 శానిటైజర్ బాటిళ్లు, 500 మాస్కులు అందజేశారు. కరోనా వ్యాప్తి భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో... పోలీసు సిబ్బంది ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. జ్యోతి సురేఖను కమిషనర్ ద్వారకా తిరుమలరావు అభినందించారు. పారిశుద్ధ్య పనుల్లో ఉన్న సిబ్బంది కోసం 700 శానిటైజర్ బాటిళ్లు, 700 మాస్కులను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్‌కు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జ్యోతి సురేఖ కోరారు.
ఇవీ చదవండి: 'పీఎం కేర్స్' సహాయనిధికి క్రికెటర్ రైనా భారీ విరాళం