ETV Bharat / state

'తెదేపా హయాంలోని ఆ పథకాలపై సీబీఐ విచారణ' - cbi enquiry on tdp schems

రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయానికి గత ప్రభుత్వం 2700 ఎకరాలు కేటాయించగా... 2,200 ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 500 ఎకరాలు ప్రభుత్వ అధీనంలో ఉంటాయని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ap-cabinet-has-decided-to-seek-a-cbi-inquiry-into-past-government-schemes

author img

By

Published : Jun 11, 2020, 4:27 PM IST

Updated : Jun 11, 2020, 5:38 PM IST

తెలుగుదేశం హయాంలో అనినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం.... సీబీఐ దర్యాప్తుతో నిజాలు తేల్చాలని నిర్ణయించింది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, ఫైబర్ నెట్ పథకాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. అలాగే.. మరిన్ని కీలక నిర్ణయాలు, ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

'జగనన్న తోడు పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 45- 60 ఏళ్లు గల మహిళలకు ఏడాదికి రూ.18,750 ఆర్థిక సాయం అందనుంది. దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కోసం వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చుకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టు తీర్పు ప్రకారం జీవోలో మార్పులకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఐదేళ్లు ఉన్న తర్వాతే ఇల్లు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది' అని మంత్రి పేర్నినాని తెలిపారు.

మంత్రివర్గం ఆమోదించిన మరికొన్ని అంశాలు

  • విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు
  • తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటు
  • 'జగనన్న తోడు'తో చిరు వ్యాపారులకు సున్నావడ్డీకి రూ.10 వేల చొప్పున రుణాలు
  • జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయింపు
  • రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు
  • రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి నిధుల కేటాయింపు
  • గండికోట రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేర నిల్వ చేసేలా చర్యలు
  • భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2,200 ఎకరాలే కేటాయింపు
  • ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం
  • వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావరాసం కల్పన
  • గండికోట నిర్వాసితుల తరలింపునకు రూ.522.85 కోట్ల మంజూరు
  • విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో గ్రేహౌండ్స్ శిక్షణకు 385 ఎకరాలు కేటాయింపు
  • బిల్డ్ ఏపీలో భాగంగా 16 స్థలాలకు గాను 11 స్థలాల విక్రయం
  • ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పన
  • ప్రభుత్వ విభాగాల్లోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కార్పొరేషన్ ఏర్పాటు
  • ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ ఏర్పాటు
  • 'ఇంటిగ్రేటెడ్‌ రెన్యువల్‌ ఎనర్జీ ప్రాజెక్టు గ్రీన్ కో'కు కేబినెట్‌ ఆమోదం
  • 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ

ఇదీ చదవండి:

'లారీ కింద తోసి నన్ను చంపాలని ప్లాన్​ చేశారు'

Last Updated : Jun 11, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.