ETV Bharat / state

Funeral for Cow: గోమాతకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు - కృష్ణా జిల్లా ఘంటసాల మండలం

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పులో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన గోమాతకు ఓ రైతు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రేమగా పెంచుకున్న ఆవు చనిపోవడంతో ఆ రైతు కుటుంబసభ్యులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఆవుపై ప్రేమతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఖననం చేశారు.

Funeral for Cow
Funeral for Cow
author img

By

Published : Aug 27, 2021, 12:54 PM IST

కంటికి రెప్పలా కాపాడిన ఆవు కళ్లముందే మృతి చెందడంతో చలించిన ఆ రైతు సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి.. దానిపై తనకున్న మమకారాన్ని చూపించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పులో జరిగింది. గ్రామానికి చెందిన రైతు గుత్తికొండ వరప్రసాద్​కి చెందిన ఆవుకు నెలలు నిండి దూడకు జన్మనిచ్చే సమయంలో పేగు మెలిపడి.. గర్భసంచి చీలడంతో అనారోగ్యానికి గురైంది.

వైద్యశాలకు తీసుకెళ్లినా దక్కని ప్రాణం..

ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆవు పడుతున్న బాధను చూసి చలించిన రైతు వరప్రసాద్.. దానిని కాపాడుకునేందుకు గన్నవరంలోని పశు వైద్య కళాశాలకు ప్రత్యేక వాహనంపై తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించారు. అప్పటికే కడుపులో మృతి చెందిన దూడను బయటికి తీసి.. ఆవుకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వైద్య సహాయం అందించారు. ఆవు ఇంటికి వచ్చిన మరుసటి రోజే మృతి చెందడంతో వరప్రసాద్ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వరప్రసాద్ దంపతులు మృతి చెందిన ఆవుకు ప్రత్యేక పూజలు చేసి.. శాస్త్రోక్తంగా తమ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

COVID: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలవరం..ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.