శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావును అమలాపురంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గత నెల 29న అమలాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకరిల్లడాన్ని... శెట్టి బలిజ సంఘం తీవ్రంగా ఖండించింది. వేణు తన చర్యలతో శెట్టిబలిజ జాతిని అవమానించారని.. సూర్యనారాయణతో సహా ఆ సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఈ నెల 7న అమలాపురం వచ్చిన వేణుగోపాలకృష్ణ.. జాతికి క్షమాపణ చెప్పాలంటూ అమలాపురంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ పరిణామాల దృష్ట్యా కోనసీమ జిల్లా మురమళ్లలో ఇవాళ జరుగుతున్న ముఖ్యమంత్రి సభకు వెళ్లకుండా సూర్యనారాయణరావును గృహ నిర్బంధం చేశారు. వైకాపా నాయకుడిగా ఉన్న తనను మంత్రి ప్రోద్బలంతో అడ్డుకోవడం దారుణమని సూర్యనారాయణరావు మండిపడ్డారు.
"శెట్టిబలిజల సమస్యలపై సీఎంకు వినతిపత్రం ఇద్దామనుకున్నా. సీఎం సభకు వెళ్లకుండా పోలీసులు నన్ను గృహనిర్బంధించారు. మంత్రి వేణు ఒత్తిడితో పోలీసులపై చర్యలు తీసుకుంటే ఊరుకోము. పోలీసులకు ఏమైనా జరిగితే వారి తరఫున ఉండి పోరాటం చేస్తాం."-కుడుపూడి సూర్యనారాయణరావు, శెట్టిబలిజ మహానాడు కన్వీనర్
యువతి గృహనిర్బంధం: కోనసీమసీమ జిల్లా అమలాపురంలో రేణుక అనే యువతిని పోలీసులు గృహనిర్బంధం చేయడంపై తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వైకాపా నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు కుమారుడు ధనుష్‌ని ప్రేమించానని...వారి వివాహం జరగకుండా కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని... ఇందులో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ప్రమేయం ఉందని ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయన్ని... ఈ రోజు కోనసీమకి వస్తున్న సీఎం జగన్ కు చెప్పుకుందామనుకుంటే... పోలీసులు గృహనిర్బంధం చేశారని వాపోయింది. తమకు ఏమైన జరిగితే మంత్రి వేణుతో పాటు పలువురు నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.
ఇవీ చదవండి: