గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన జడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట వైకాపా నేతలు ధర్నా చేపట్టారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాల గేటుకు తాళం వేశారు. సమయం దాటిన తర్వాత విధులకు వచ్చిన ముగ్గురు ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. సమయానికి బడికి రాని, శతశాతం ఫలితాలు తీసుకురాలేని టీచర్లు తమకు వద్దని బైఠాయించారు.
ఇదీచదవండి.