ETV Bharat / state

సున్నపురాయి అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిస్తాం...హైకోర్టు

సున్నపురాయి అక్రమ తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయడానికి ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నట్టూ హైకోర్టు తెలిపింది. అనంతరం ప్రతివాది వాదనలను విన్న ధర్మాసనం విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

సున్నపురాయి అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిస్తాం...హైకోర్టు
author img

By

Published : Aug 27, 2019, 9:25 AM IST

సున్నపురాయి అక్రమ తవ్వకాలపై ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిస్తాం...హైకోర్టు

గుంటూరు జిల్లాలోని కేశనుపల్లి, నడుకుడి, పిడుగురాళ్ల, కోనంకి గ్రామాల్లో లైంస్టోన్ అక్రమ తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తామని హైకోర్టు పేర్కొంది. న్యాయస్థాన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. గురజాల తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులు సున్నపురాయి ఆక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని పేర్కొంటూ... మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఖజానాకు 31.39 కోట్ల రూపాయల నష్టాన్ని బాధ్యుల నుంచి రాబట్టేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరగా.. ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ దర్యాప్తుపై పురోగతిని సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. ఇందులో 24 మంది సాక్షుల వాంగ్మూలాలు, 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అనంతరం సొమ్ము ఎటు తరిలిందనే అంశంపై ద్రవ్య అక్రమ రవాణ నిరోధక చట్టం కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయడం మంచిదన్నారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రప్రభుత్వమే కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరవచ్చని సూచించింది. దీనికి ఏజీ బదులిస్తూ...కోర్టు విచారణ పరిధిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. అందుకు స్వేచ్ఛ ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంలో యరపతినేని తరపున న్యాయవాది కొంత గడువు కావాలని కోరారు. తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు న్యాయస్థానం విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: వాసిరెడ్డి పద్మ ప్రమాణంలో ఆకట్టుకున్న సన్నివేశం

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు గ్రామాలలో శనివారం ఘనంగా జరిగాయి జీలుగుమిల్లి లో శ్రీ కోదండ రామాలయం వద్ద సీతారాముల కల్యాణం భక్తులను కన్నుల పండువగా జరిగింది ఆలయ అర్చకులు చిరంజీవి శర్మ స్వామివారి కల్యాణం వైభవంగా జరిపారు ఆర్యవైశ్య సంఘం ఇచ్చిన పలువురు కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాల్లో ఉభయ దారులుగా వ్యవహరించారు స్వామివారి కల్యాణం అనంతరం పానకాన్ని భక్తులకు పంపిణీ చేశారు కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన వందలాది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.