Varla Ramaiah Comments on DIG: లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. లోకేశ్ పాదయాత్ర జరిగితే.. ఆ పాదం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేస్తుందని సీఎం జగన్ భయపడుతున్నారు.
అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి, డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డిని యువగళం యాత్రపైకి ప్రయోగించారని విమర్శించారు. రఘురామ్ రెడ్డిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తు, రవిగుప్తా అనే అధికారి అతనికి ఛార్జ్ మెమో ఇవ్వడం, పొలాల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంలో అతని ప్రమేయం వంటి వివరాలన్నీ తమకు తెలుసని అన్నారు. పాదయాత్రలో ఓవరాక్షన్ చేసే పోలీసులని వదిలేది లేదని హెచ్చరించారు.
LOKESH YUVAGALAM : చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మైక్ తీసుకొస్తున్న టీడీపీ కార్యకర్తను అడ్డుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి మైక్ లాక్కున్నారు. లోకేశ్ నిల్చొన్న స్టూల్ కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టూల్ మీదే నిల్చొని లోకేశ్ నిరసన తెలిపారు.
మహదేవపురంలో ఎస్సీలతో మాట్లాడిన లోకేశ్: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని చంపేసే పరిస్థితులున్నాయని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. 14వ రోజూ..యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు ముత్యాలమ్మ గుడిలో పూజలు, గుడ్ షెపర్డ్ చర్చిలో ప్రార్థనలు అనంతరం ఇవాళ్టి యాత్రను ప్రారంభించారు. మహదేవపురంలో బొమ్మలు తయారు చేసే ఎస్సీలతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు చేయడం తప్ప.. వారి సంక్షేమానికి ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చు చేయడం లేదని.. దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: