గ్రామ సచివాలయాల్లో ఉద్యానశాఖ తరఫున భర్తీ చేేసే హెచ్ఈవో ఉద్యోగాలకు ఉద్యాన డిప్లొమా, ఉద్యాన డిగ్రీలను మాత్రమే అర్హతగా నిర్ణయించాలని సంబంధిత విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి గురువారం గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. తమకు తగిన న్యాయం చేయకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతామని విద్యార్థులు హెచ్చరించారు. రైల్వేకోడూరు నందు ఉద్యాన డిగ్రీ విద్యార్థులకు, పోలవరం నందు ఉద్యాన డిప్లొమా విద్యార్థులకు, గ్రామ సెక్రటేరియట్ నందు ఉద్యాన కోర్సులు చేసిన వారితో మాత్రమే పోస్టులను భర్తీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని దానిని నిలబెట్టుకోవాలని కోరారు. నేడు నాన్ డిప్లొమా హార్టికల్చర్ విద్యార్థులకు కూడా ఉద్యాన శాఖలో ఉద్యోగాలు కల్పించడం దారుణమన్నారు. డిప్లొమా, బీఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేసి అర్హులైన ఎంపీఈవోలను అనుభవం , మెరిట్, సీనియార్టీ ఆధారంగా ఎచ్ఈవోలుగా గ్రామ సచివాలయాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే అగ్రికల్చర్ కమిషనర్ దీనిపై పునరాలోచించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు .
'న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం' - jobs
గుంటూరులోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్యాన డిప్లమో, ఉద్యాన డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు నిరసన చేపట్టారు. సచివాలయాల ఉద్యోగాల్లోకి తమను తీసుకోవాలని డిమాండ్ చేశారు.