ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్ధుల ర్యాలీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ రావటంతో ఎమ్మెల్యేను అడ్డగించి స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేశ్ బహిరంగ సవాల్