ETV Bharat / state

గుంటూరులో రెండో రాష్ట్ర స్థాయి మున్సిపల్ క్రీడా పోటీలు ప్రారంభం

author img

By

Published : Dec 13, 2019, 9:29 PM IST

రెండో రాష్ట్ర స్థాయి మున్సిపల్ క్రీడా పోటీలు గుంటూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ శామ్యూల్ పోటీలను ప్రారంభించారు. ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని క్రీడాకారులు ఆటల్లో రాణించాలని కలెక్టర్​ సూచించారు.

state level second muncipal games started in guntur
గుంటూరులో రెండవ రాష్ట్రస్థాయి మున్సిపల్ క్రీడా పోటీలు ప్రారంభం
రాష్ట్ర స్థాయి మున్సిపల్​ క్రీడా పోటీలు ప్రారంభించిన కలెక్టర్​
గుంటూరు జిల్లా కేంద్రంలో రెండో రాష్ట్ర స్థాయి మున్సిపల్ క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ శామ్యూల్​ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పాఠశాలలకు అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కలెక్టర్​ సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం చేకూరుతాయని చెప్పారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని.. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ అన్నారు. నగరంలో మూడు రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇదీ చదవండి:

'అయేషా మీరా హత్య కేసు.. మరోసారి శవపరీక్ష'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.