గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అరుదైన ఆరు పక్షి పిల్లలు కనిపించాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోని గదిలో కప్ బోర్డులో దాక్కుని ఉన్న వీటిని యజమాని గుర్తించి సంరక్షించారు.
తెల్లని రంగుతో పెద్ద కళ్లు, పొడవాటి ముక్కుతో ఉన్నాయి. గింజలు వేసినా తినడం లేదు. రాత్రి సమయాల్లో తల్లి పక్షి వచ్చి పోతున్నట్లు తెలిసింది. చనిపోయిన ఎలుకను తల్లి పక్షి వదిలివెళ్లటంతో దానిని తింటున్నాయి. ఎవరైనా దగ్గరకు వెళితే బుసకొడుతున్నాయి. ఇవి అరుదైన మాస్క్డ్ గుడ్లగూబ జాతికి చెందిన పక్షులుగా స్థానికులు భావిస్తున్నారు. అటవీ అధికారులు వీటిని తీసుకెళ్లి సంరక్షించాలని భవన యజమాని కోరుతున్నారు.
ఇదీ చదవండి: