గుంటూరు జిల్లాలో కరోనా ఆంక్షల మధ్యే ముస్లింలు రంజాన్ పండుగను నిర్వహించుకున్నారు. పరిమిత సంఖ్యలో ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేశారు. మంగళగిరిలో నెలరోజుల ఉపవాస దీక్ష పాటించి.. రంజాన్ పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఆయా మసీదుల్లో కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే ముస్లింలు నమాజ్ లో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ముస్లింలు కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లల్లోనే పండుగను జరుపుకొన్నారు.
ఇవీ చూడండి…: గోడు వింటారు.. పడక లేదంటారు!