గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం మురికిపూడి గ్రామంలోని జడ్పీ, ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న.. నాడు - నేడు పనులను ఎమ్మెల్యే విడదల రజిని ఆదివారం పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆమె అధికారులకు తెలిపారు.
వర్షకాలం వస్తున్న తరుణంలో పనుల్లో జాప్యం జరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం నాడు- నేడు పథకాన్ని తీసుకొచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కె.లక్ష్మీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరిముల్లా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: