కమిషనర్ ప్రద్యుమ్న... ఆ శాఖ అధికారులు, మార్కెట్ యార్డుల కార్యదర్శులతో గుంటూరులో సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధరలు తగ్గేవరకు రైతుబజార్లలో రాయితీపై ఉల్లి అందిస్తామని చెప్పారు. ఉల్లి, పత్తి కొనుగోళ్లతోపాటు మార్కెటింగ్ శాఖకు వస్తున్న ఆదాయం, ఈనాం విధానం అమలు, తదితర అంశాలపై చర్చించారు.
ఉల్లి ధరలు పెరిగిన తరుణంలో... నవంబర్ 14 నుంచి రైతుబజార్లలో కిలో రూ.25కే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఉల్లి దిగుబడులు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లోనూ ఉల్లి పంట ఆశించిన మేర లేదన్నారు. ఈజిప్టు నుంచి 2వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండీ: