రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేశ్ బహిరంగ సవాల్ - latest news of lokesh
అధికారంలోకి వచ్చిన 7 నెలల నుంచి జగన్ తొవ్వుతున్నది అవినీతిని కాదు... వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అమరావతిపై జగన్ చేసిన ఆరోపణలను లోకేశ్ తప్పుపట్టారు. రాజధాని ప్రాంతంలో 1170 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. ఉపసంఘం నివేదికపై ప్రభుత్వానికి లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. 7నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై న్యాయపరమైన విచారణకు సీఎం జగన్ సిద్ధమా అంటూ... ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.