అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత రుణాలు మాఫీ చేస్తానని వైకాపా అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నికల ప్రచారానికి జగన్ హాజరయ్యారు. ఒకసారి అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం మళ్లీ తెస్తానన్నారు. బీసీ - ఈ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రుణాలు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానన్నారు. కుప్పం, మంగళగిరిలో ప్రచారానికి పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి..