నాగార్జున సాగర్ జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరద నీటితో ఏటి ఒడ్డు గ్రామాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లా వెల్లంపల్లికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రేగుల గడ్డ, గోవిందపురం, వేమవరంలో వరద నీరు భారీగా పెరుగుతోంది. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీవో పార్థ సారథి సూచించారు. గురజాల మండలంలోని గొట్టిముక్కల, దైదా రామలింగేశ్వర స్వామి ఆలయం పరిధిలోని నదీ ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఆలయంలోకి భక్తులను అనుమతించవద్దని దేవాలయం కమిటీకి సూచించారు. దాచేపల్లి మండలం రామాపురం, పొందుగులలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల రామాపురం ఎస్సీ కాలనీ, మత్య్స కాలనీల్లోని వీధులు చెరువును తలపిస్తున్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-స్వాతంత్య్ర దినోత్సవాన స్టెప్పులు... వైద్యుల తీరుపై విమర్శలు