వేర్వేరుగా దాఖలైన మూడు ఎన్నికల పిటిషన్లలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ , పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైకాపా నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓట్లను సక్రమంగా లెక్కించకపోవడంతో తాను ఓటమిపాలయ్యానన్నారు. రామానాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ వైకాపా అభ్యర్థి సత్యనారాయణమూర్తి తరపున వాసుదేవరావు, గద్దె రామ్మోహన్‌రావు ఎన్నికను సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం ముగ్గురికి నోటీసులు జారీ చేసింది.
ఇదీచదవండి