ETV Bharat / state

కరోనా నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 100 పడకలతో ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. అవసరాన్ని బట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా 4 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకూ జిల్లాలో ఎవరికి కరోనా నిర్ధరణ కాకపోయినా... రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాపిస్తోన్న దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టారు.

guntur district officials ready to face corona virus
కరోనా నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం
author img

By

Published : Mar 21, 2020, 10:17 AM IST

Updated : Mar 21, 2020, 3:51 PM IST

కరోనాపై అప్రమత్తంగా ఉన్నామన్న వైద్య అధికారులు

కరోనా వైరస్ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం కాగానే వివిధ దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై వైద్య, ఆరోగ్య, రెవెన్యూ శాఖలు దృష్టిసారించాయి. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి సమాచారం తీసుకుని.. వారిని పరీక్షించి 28 రోజులపాటు నిర్బంధంలో ఉండమని సూచించారు. స్థానికంగా ఉండే వీఆర్వోలు, సచివాలయ సిబ్బందికి ఈ మేరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఇలా ఇప్పటివరకు 36 మంది ఇంట్లోనే ఉన్నారు. మరో 13 మందిని 28 రోజులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఇప్పటివరకు ఐదుగురు కరోనా అనుమానిత లక్షణాలతో రాగా.. వారి రక్తనమూనాలు సేకరించి తిరుపతి ప్రయోగశాలకు పంపారు. వాటిలో 4 నెగిటివ్ వచ్చాయి.

ఐసోలేషన్ వార్డులు సిద్ధం

గురువారం రాత్రి ఆసుపత్రిలో చేరిన ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధుడికి సంబంధించిన నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అనుమానితుల సంఖ్య తక్కువగా ఉన్నందున సంక్రమిత వ్యాధుల ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి అక్కడే వారికి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ కరోనా అనుమానితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు 24 గంటలు సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. ఐడీ ఆసుపత్రిలో 4 వెంటిలేటర్లు, మొబైల్ ఎక్స్​రే యూనిట్ అందుబాటులో ఉంచారు. సరిపడా మందులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచామని ఐడీ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ సునంద తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం

కరోనా అనుమానితుల సంఖ్య పెరిగితే ఏం చేయాలనే దానిపైనా దృష్టి సారించామని అధికారులు తెలిపారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. మరో 100 పడకల విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎవరికైనా వ్యాధి ఉందని తేలి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలు సరిపోకపోతే... ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా వైద్యం అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 4 ఆసుపత్రులతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. గుంటూరులోని రమేష్ ఆసుపత్రి, శ్రీ హాస్పిటల్, మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా నియంత్రణలో భాగంగా నగరంలో సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేశారు. ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వటం లేదు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ఇవీ చదవండి:

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Last Updated : Mar 21, 2020, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.