గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో పోలేరమ్మ అమ్మవారికి కోటి మల్లెపూల పూజ వైభవంగా జరిగింది. దాదాపు 20 వేల మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారులను అలకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. మల్లెపూలతో పోలేరమ్మ అమ్మవారిని భక్తులు ప్రత్యేకంగా పూజించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. వేడుకకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా మహిళలు తరలివచ్చారు. ఈ నెల 30 న సిరిమాను ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి