గుంటూరు జిల్లా పెదనందిపాడులో కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు తెలియజేశారు. గ్రామంలోని ఓ వ్యక్తి.. తన కన్న కుమార్తెపై ఈనెల 7న అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఆ విషయం బయటకు చెప్పలేక.. ఆవేదన భరించలేక.. ఎలుకల మందును శీతల పానీయంలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడిని నేడు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి...