ETV Bharat / state

రసాయనాలే గోవుల ప్రాణాలు తీశాయి... - cow death sit investigation

గత నెల రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోవుల మృతిపై సిట్‌ అధికారులు దర్యాప్తు కొలిక్కి వచ్చింది. గోవుల మృతికి పశుగ్రాసంలో అధిక మోతాదులో ఉన్న రసాయన అవశేషాలే కారణమని నిర్దారణకు వచ్చారు. కుట్ర కోణంకు సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు దొరకలేదని...త్వరలో నివేదికను ఉన్నతాధికారులకు అందచేయనున్నామని తెలిపారు.

cow-death-sit-investigation
author img

By

Published : Sep 21, 2019, 9:58 AM IST

గోవుల మృతిపై సిట్‌ బృందం దర్యాప్తు కొలిక్కి

రసాయన ఆహారమే కారణం...

విజయవాడ శివారు తాడేపల్లిలోని గోశాలలో గత నెల 85ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. గోవుల మృతిపై వేసిన సిట్ దర్యాప్తు తుది దశకు చేరింది. సిట్ అధికారులు అన్ని అంశాలను క్రోడీకరించి నివేదిక తయారు చేస్తున్నారు. పశుగ్రాసంలో మితిమీరిన స్థాయిలో ఉన్న రసాయన అవశేషాలే పశువుల మృతికి కారణమని సిట్‌ బృందం స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే...

గోవులకు తిన్న పశుగ్రాసానికి వాడిన పురుగుమందులు, ఎరువులు , తదితరవాటిని అధికారులు పరీక్షించారు. గోశాలకు సంభందించిన దస్త్రాలను కూడా తనిఖీ చేసి.. నిర్వహణ తీరు , నిర్లక్ష్యం , తదితర అంశాలను పరిశీలించారు . గన్నవరం విశ్వవిద్యాలయ కమిటీ కూడా నమూనాలు పరీక్షించింది. సాధారణంగా పచ్చి గడ్డిలో నైట్రేట్లు,నైట్రైట్ల అవశేషాలు 1.6 శాతం లోపు ఉండాలి . ఈ పరిమితి దాటితే విషపూరితంగా మారుతుంది . గోవులకు ఇచ్చిన పశుగ్రాసంలో 3.8 గ్రాముల నుంచి గరిష్ఠంగా 4 గ్రాముల వరకు నైట్రేట్లు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఎక్కువ పరిమాణంలో గ్రాసాన్ని తిన్న ఆవులు మృతి చెందాయి. తక్కువ తిన్నవి అస్వస్థతకు గురయ్యాయని తేలింది. అధిక నైట్రైటు కలిసిన గ్రాసాన్ని తినడం వల్ల రక్తంలో మెత్ హిమోగ్లోబిన్ ఏర్పడి..ఆవులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని పరీక్షల్లో తేలింది.

ఎక్కువ నైట్రేట్లు ఉన్న ఆహారం వల్లే ఇలా...

నైట్రేట్లు అధికంగా ఉన్న గ్రాసాన్ని తీసుకోవటం వల్లే గోవులు మృతి చెందాయని సిట్‌ అధికారులు నిర్దారించారు. పూర్తి నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు అందచేయనున్నట్లు తెలిపారు.

Intro:21

Body:21

Conclusion:శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి 1.56 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది .ఆనకట్ట నాలుగు గేట్లను పది అడుగుల మేర పైకెత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తికి 2400 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 5వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 884.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 214 టిఎంసిలు గా నమోదయింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.