ETV Bharat / state

అధికారి వేధింపులు భరించలేకున్నామని.. డీజీపీ, ఐజీలకు ఫిర్యాదు.. - harsarment on staff by polcie officer in guntur dst

గుంటూరు జిల్లాలోని ఓ అధికారి వేధింపులు భరించలేకున్నామంటూ పలువురు పోలీసు సిబ్బంది ఏకంగా డీజీపీ, గుంటూరు రేంజ్‌ ఐజీలకు ఫిర్యాదు చేయటం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ, ఐజీలు ప్రత్యేక విచారణ చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు సమాచారం.

complait to dgp and ig in guntur dst polcie about harrasment of a officer

author img

By

Published : Jul 20, 2020, 1:22 PM IST

ఓ ఉన్నతాధికారి వేధింపులు తట్టుకోలేక పోతున్నామని గుంటూరు జిల్లాలో పోలీస్​ సిబ్బంది డీజీపీ, గుంటూరు రేంజ్​ ఐజీలకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో అధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 15 మంది సిబ్బందిని కేటాయించారు. ఆ బృందాల పర్యవేక్షణ బాధ్యతలను ప్రత్యేకంగా ఒక అధికారికి అప్పగించారు. కొద్దినెలల కిందట జిల్లాకు వచ్చిన ఆ అధికారి వారాంతపు సెలవులు అడిగితే బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో వాపోయారు.

సెలవు అడిగితే వీఆర్‌లోకి పంపిస్తానంటున్నాడని...పోలీసు మాన్యువల్‌లో వీక్లీ ఆఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటూ నిలదీస్తున్నాడని తెలిపారు. కనీసం సీఎల్‌ కూడా ఇవ్వటం లేదని, కేవలం అత్యవసర సమయంలో ఇస్తానంటూ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు.

జిల్లాలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్న క్రమంలో తమ బృందాలతో పెద్దగా పని ఉండదని, ఆ సమయంలోనైనా వారాంతపు సెలవులు ఇవ్వాలని అడిగితే మీకు చేతనైంది చేసుకోమంటున్నాడని పేర్కొన్నారు. ఇ.ఎల్‌.ఎఫ్‌.పి.లు జిల్లా ఎస్పీ మంజూరు చేసినా వాటిని ఆ అధికారి రద్దు చేయిస్తున్నాడని ఆరోపించారు.

అంతేకాకుండా తమకు ఇ.ఎల్‌.ఎఫ్‌.పి. వద్ధు..రద్దు చేయండంటూ తాము కోరుతున్నట్లు బలవంతంగా అర్జీ రాయించుకొని వేధిస్తున్నాడంటూ వాపోయారు. ఎవరికైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే సస్పెండ్‌ చేయిస్తాను అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై జిల్లా స్థాయి అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి

కొవిడ్‌ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.