Complaints on Duplicate Votes Electoral Roll Amendment Campaign: రాష్ట్రంలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లో.. రెండో రోజూ చిత్ర విచిత్రాలు వెలుగుచూశాయి. చాలాచోట్ల మరణించిన వారి పేర్లను జాబితా నుంచి ఇంకా తొలగించలేదు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నంబరులో పదుల సంఖ్యలో ఓట్లు దర్శనమిచ్చాయి.
గుంటూరు 45వ డివిజన్ గోరంట్లలోని నవీన స్కూల్ ప్రత్యేక శిబిరానికి వచ్చిన ఓటర్లు.. ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ ఓట్లను స్థానిక పోలింగ్ కేంద్రానికి మార్చాలని దరఖాస్తులు ఇచ్చారు. అధికారులు సరిగ్గా స్పందించలేదని ప్రశ్నించినందుకు తమ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకున్నారని.. ఓ ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామాల్లోనే ఉన్నా ఫారం 7 నోటీసులు - ఎన్నికల అధికారుల సమావేశంలో బాధితుల ఆగ్రహం
"నేను 2సంవత్సరాల క్రితం గుంటూరుకు వచ్చాను. ఎన్రోల్మెంట్ అన్లైన్ మారిస్తే కాలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను మీడియాను కలిసినందుకు నా వివరాలు ప్రత్యేకంగా నమోదు చేసుకోవడం బాధ కలిగించింది." - ఓటరు
5గురు ఉన్న ఇంట్లో 12మంది ఓట్లు దర్శనం: గుంటూరులో 41, 45 డివిజన్లలో ఒకే డోర్ నెంబర్ తో కొత్త ఓట్లు భారీగా పుట్టుకువచ్చాయని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 45 డివిజన్ లో ఓ ఇంట్లో ఐదుగురు ఓటర్లు ఉంటే.. జాబితాలో 12 ఓట్లు దర్శనమిచ్చాయని ఆరోపించారు. 41 డివిజన్ లోనూ అదనపు ఓట్లపై సందేహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు
తమిళనాడు వాసులకు స్థానికంగా ఓటు: ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికారుల ఆలసత్వం వల్ల తమ ఓట్లు.. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోకి వెళ్లాయని వాపోయారు. తాడికొండ నియోజకవర్గంలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నవారు 1900 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడు నుంచి పనుల కోసం తాడికొండకు వచ్చి.. తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయిన వారికీ జాబితాలో ఓట్లు కల్పించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకే ఇంటి ఓట్లు వేర్వేరు బూత్‌ల్లో: ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితాపై కొందరు అభ్యంతరాలు తెలుపుతూ.. అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. డబుల్ ఎంట్రీలు తొలగించాలని కోరారు. విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గంలో అడ్రస్ మార్పుల కోసం 16 వందల 88 దరఖాస్తులు పెట్టుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఓట్లు జంబ్లింగ్ అయ్యాయి. ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తల పేర్లు వేర్వేరు పోలింగ్ బూత్‌ల్లో ఉన్నట్లు జాబితాలో కనిపించింది.
'జగనే ఎందుకు కావాలంటే' నిర్వహణతో ప్రజాధనం దుర్వినియోగం - గవర్నర్, సీఈసీకి ఫిర్యాదు
తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో మృతుల పేర్లు ఇంకా జాబితాలోనే ఉన్నాయి. గొల్లపూడి, కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో బోగస్ పేర్లు గుర్తించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీలతో పాటు.. ఒకే ఇంటిలో 10 దొంగ ఓట్లు గుర్తించారు. నందిగామలోనూ ఓట్లు గల్లంతైనట్లు దరఖాస్తులు వచ్చాయి. డబుల్ ఎంట్రీలు, మృతుల పేర్ల తొలగింపులో అధికారుల తీరు సరిగ్గా లేదని విపక్ష పార్టీల ప్రతినిధులు ఆరోపించారు. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఓటర్ల జాబితాలో అక్కడక్కడ డబ్లింగ్ ఓట్లు కనిపించాయి. మృతుల ఓట్లు ఇంకా తొలగించకపోవడంపై స్థానిక నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
"ఎటువంటి ఫిర్యాదు చేసిన పట్టించుకునే అధికారి ఎవరూ లేరు. గ్రామ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు అందరూ ప్రభుత్వానికి లోబడి పనిచేయటం వల్ల ప్రజలు వారి హక్కులను కోల్పోతున్నారు." -దశరధ రామారావు, పెనుగంచిప్రోలు
"రాజ్యంగంలో రాసిన చట్టానికి సంబంధం లేకుండా.. చనిపోయిన వారి పేర్లు అవకాశం ఉంచుతున్నారు. కొందరు బతికున్న వారి పేర్లను తీసేస్తున్నారు. ఒక ఇంటి నెంబర్‌పై వారి ఇంట్లో నమోదైన వారే.. ఓటరు జాబితాలో ఆ ఇంటి నెంబర్‌పై ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా" -రమణారెడ్డి, టీడీపీ ప్రతినిధి