ETV Bharat / state

ఈ సంక్రాంతికి కుందనపు బొమ్మలా తయారవుతున్నారా..

Beauty Tips for Women : సంక్రాంతి పండుగకు అమ్మాయిల హడావుడి మామూలుగా ఉండదు. తెల్లవారుజామునే ఇంటి ముందు ముగ్గు పెట్టడంతో మొదలై.. వంటింట్లో పిండి పదార్థాలు తయారు చేయడం వరకు వీళ్లదే సందడంతా. అయితే ఈ పండుగకు అమ్మాయిలంతా పదహారణాల కుందనపు బొమ్మలా అలంకరించుకుంటారు. మరి అలా రెడీ అయ్యే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దామా..

Beauty Tips for Women
సంక్రాంతి పండుగ
author img

By

Published : Jan 14, 2023, 7:16 AM IST

Beauty Tips for Women : సంక్రాంతి.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా సంబరాలు జరుపుకొనే పెద్ద పండగ. రంగవల్లులు, డూ డూ బసవన్నల హడావిడితో కోలాహలంగా సాగే ఈ పండగలో ఆడపడుచులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? పదహారణాల తెలుగింటి అమ్మాయిలా సంక్రాంతి సొగసులతో సాక్షాత్తూ 'సంక్రాంతి లక్ష్మి'ని తలపిస్తారు. అయితే ఇలా తయారయ్యే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రకాశవంతమైన చర్మానికి..

ప్రకాశవంతమైన చర్మానికి..

సంప్రదాయబద్ధంగా అందంగా కనిపించాలంటే అందుకు మెరిసే మృదువైన చర్మం తప్పనిసరి. దీనికోసం సహజ చర్మతత్వం ఉన్నవారు చెంచా నారింజ తొక్కల పొడి తీసుకొని రెండు చెంచాల కాచి చల్లార్చిన పాలలో వేసి బాగా కలపాలి. ఒకవేళ మొటిమల సమస్య బాధిస్తుంటే ఈ ప్యాక్‌లో పాలకు బదులుగా రోజ్‌వాటర్ ఉపయోగించవచ్చు.

ఈ రెండింటినీ మిక్స్ చేసి మెడ నుంచి ముఖం వరకు ప్యాక్ అప్త్లె చేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మీద ఉండే నల్లమచ్చలు, మృతకణాలు.. అన్నీ తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మం సహజసిద్ధంగా మెరుపుని సంతరించుకోవడానికి నీరు తప్పనిసరి. కాబట్టి ప్రతి రోజూ తగినన్ని నీళ్లు తాగడం అవసరం.

ఆభరణాలతో..

ఎత్తుకు తగ్గట్లు.. ఇక డ్రస్సింగ్ విషయానికొస్తే పొడుగ్గా ఉన్నవారు కింది భాగంలో కనీసం 5 అంగుళాల బోర్డర్ ఉన్న డిజైనర్ చీరల్ని, లంగావోణీని ఎంపిక చేసుకోవాలి. నిలువు చారల జోలికి అస్సలు పోకూడదు. అవి మరింత సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేసి లుక్‌ని తగ్గించేసే అవకాశాలుంటాయి. అలాగే బ్లౌజ్‌కి కూడా సెమీఫ్రిల్స్, హ్యాంగింగ్స్.. వంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది.

అదే ఎత్తు కాస్త తక్కువగా ఉండేవారు పెద్ద పెద్ద ప్రింట్స్, బోర్డర్స్ ఉన్నవాటి జోలికి అస్సలు పోకూడదు. వీటి వల్ల ఎత్తు మరింత తక్కువ ఉన్నట్లు కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే బోర్డర్ ఎంత సన్నగా తీసుకుంటే అంత ఎత్తుగా కనిపించే వీలు ఉంటుంది. నిలువు గీతలు ఉన్న డిజైన్స్ తక్కువ ఎత్తు ఉన్నవారికి చక్కని ఎంపిక. అయితే అడ్డ గీతలు ఉన్నవి అస్సలు ఎంపిక చేసుకోకూడదు. బ్లౌజ్ కూడా ఎంత వీలైతే అంత సింపుల్‌గా కుట్టించుకోవాలి.

మేకప్..

మేకప్.. ముందుగా ముఖానికి, మెడకి.. ఇలా మేకప్ వేసుకునే చోట కొద్దిగా మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకోవాలి. అది చర్మంలోకి ఇంకిన తర్వాత చర్మరంగుకు సరిపడే ఫౌండేషన్ తీసుకుని అప్త్లె చేసుకోవాలి. ముఖం మీద ఉండే మచ్చలు తొలగిపోవడానికి ముందుగానే ప్యాక్ వేసుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా కన్సీలర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. తర్వాత చర్మరంగుకు మ్యాచయ్యే కాంపాక్ట్ పౌడర్ అప్త్లె చేసుకోవాలి.

డ్రస్‌కు మ్యాచయ్యే విధంగా ఐ షాడో వేసుకోవాలి. ఒకవేళ ఏ కలర్ వేసుకోవాలో తెలియకపోతే బేబీ పింక్, మెజెంతా పింక్, ఆరెంజ్, పీచ్.. వంటివి అన్ని రంగుల డ్రస్సుల మీదకు బాగా నప్పుతాయి. తర్వాత ఐ లైనర్ తీసుకుని కనుబొమ్మల పక్క నుంచి సన్నగా అప్త్లె చేసుకోవాలి. అదేవిధంగా కళ్లకు కాటుక కూడా వీలైనంత సన్నగా పెట్టుకోవాలి. కనురెప్పలకు 2 కోటింగ్స్ మస్కారా కూడా అప్త్లె చేసుకోవాలి. ఫలితంగా కనురెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. అదేవిధంగా చర్మ ఛాయకు తగిన లిప్‌స్టిక్,ముఖాకృతికి తగిన విధంగా బిందీ పెట్టుకోవాలి.

ఆభరణాలతో.. డ్రస్సింగ్‌కు తగినట్లుగా యాక్సెసరీలు కూడా ఎంపిక చేసుకోవాలి. డ్రస్ హెవీగా ఉంటే వీలైనంత సింపుల్‌గా ఉండేవి, సింపుల్ డ్రస్సింగ్ అయితే కాస్త హెవీగా ఉండే వాటిని ఎంచుకోవాలి. వీటితో పాటు బయట ఎక్కడా కొనలేనిది.. మీకు మాత్రమే సొంతమైన చిరునవ్వును ధరించడం మాత్రం మర్చిపోకండి!

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.