గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభమైన పద్ధతిలో అందుతున్నాయని అమలాపురం వైకాపా ఎంపీ చింతా అనురాధ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నరేంద్రపురంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం అయినవిల్లి మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గాంధీ మహాత్మునికి ఘన నివాళి